![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -283 లో.. అనామిక-కళ్యాణ్ పెళ్లిలో భాగంగా దుగ్గిరాల ఇంట్లో సందడిగా ఉంటుంది. వెండి బాసిగల్ తీసుకొని వచ్చావా అని అపర్ణని ఇందిరాదేవి అడుగగా.. తీసుకుని వచ్చానని అపర్ణ చెప్తుంది. అ తర్వాత నగలు గురించి మాట్లాడుకుంటుంటే.. వాళ్ళు అసలు ఏం పెట్టేలా లేరు. కేవలం మన ఆస్తి కోసం పెళ్లి చేస్తునట్లు ఉందని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత పెళ్లిలో ఎలాంటి గొడవలు జరగకుడదని రుద్రాణికి ఇందిరాదేవి చెప్తుంది. అప్పుడే సీతారామయ్య కింద పడిపోతాడు. వెంటనే డాక్టర్ ని పిలిపిస్తాడు రాజ్.. ఎందుకో ఈ పెళ్లి ఆపేస్తేనే మంచిదని పంతులు గారు చెప్పిన మాటలని కళ్యాణ్ గుర్తుకుచేసుకుంటాడు. ధటన్యలక్ష్మి, రుద్రాణి ఇద్దరు కూడా అలాగే అంటారు. కాసేపటికి సీతారామయ్య దగ్గరికి డాక్టర్ వచ్చి తన కండిషన్ చూసి హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలని చెప్తాడు. కానీ సీతారామయ్య ఈ విషయం ఎవరికి చెప్పకండి బాగున్నాడని చెప్పండని డాక్టర్ కి చెప్తాడు. అ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి.. బాగున్నాడని చెప్పగానే అందరు రిలాక్స్ అవుతారు. మరొక వైపు రాజ్ తన రిలెటివ్స్ అయిన విక్కీ, పద్మావతి లని పెళ్లి కీ పిలుస్తాడు. మరొక వైపు అనామిక వాళ్ళ డాడ్ పెళ్లిలో ఏవైనా నగలు పెట్టలేదని అంటారేమోనని టెన్షన్ పడుతుంటే.. అప్పుడే అనామిక వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళకి చాలా ఉన్నాయి వాళ్ళు ఎందుకు అడుగుతారని చెప్తుంది. అప్పుడే అనామిక వాళ్ళ నాన్నకి గోల్డ్ షాప్ సేట్ ఫోన్ చేస్తాడు. వాళ్లకి ఇవ్వాలిసిన రెండు కోట్ల గురించి కాల్ చేస్తున్నారని అనుకుంటారు. ఆ తర్వాత అనామిక వాళ్ళ నాన్న లిఫ్ట్ చేస్తాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావని సేట్ అడుగుతాడు. మా కూతురు గొప్ప ఇంటికి కోడలు అవుతుంది. పెళ్లి అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తానని అనామిక వాళ్ళ నాన్న చెప్తాడు.
మరొకవైపు శ్వేతతో రాజ్ ఫోన్ మాట్లాడుతుంటాడు. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది. కావ్యని చూసిన రాజ్ టెన్షన్ పడుతూ పక్కకి వెళ్తుంటాడు. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా అని అనగానే రాజ్ షాక్ అవుతాడు. మరి ఆఫీస్ విషయాలకి బయటకు వెళ్లడం ఎందుకని కావ్య అంటుంది. అ తర్వాత శ్వేతకి పెళ్లి జరగబోయే రిసార్ట్ పేరు చెప్తాడు రాజ్. ఫోన్ కట్ చేసాక ఎలాగైనా పెళ్లికి వెళ్లి రాజ్ కి సర్ ప్రైజ్ ఇవ్వాలని శ్వేత అనుకుంటుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |